Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొడాలి నానిపై కేసు నమోదు చేయండి: పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ

  • తిరుమల ఆలయాన్ని మీ అమ్మ మొగుడు కట్టాడా? అంటూ నాని వ్యాఖ్య
  • హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ బీజేపీ ఆగ్రహం
  • తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
ఏపీ మంత్రి కొడాలి నానిపై బీజేపీ నేతలు తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమల వెంకన్నను దర్శించుకున్న తర్వాత మీడియాతో కొడాలి నాని మాట్లాడుతూ, 'తిరుమల ఆలయాన్ని మీ అమ్మ మొగుడు కట్టాడా' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానించారంటూ మండిపడ్డారు. చట్టాలు చేసే మంత్రులే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చట్టానికి సంబంధించిన కాపీలను బీజేపీ నేతలు పోలీసులకు అందించారు. నానిపై కేసు నమోదు చేయకపోతే కోర్టుకు వెళతామని చెప్పారు.
Kodali Nani
YSRCP
Tirumala
BJP

More Telugu News